*తొండకూరు అభివృద్ధికి ధైర్యమైన నాయకత్వం…!
*సర్పంచ్ అభ్యర్థి – అల్లరి గంగాధర్ (శక్కర్ రెడ్డి)…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
సొసైటీ గోదాం నిర్మాణానికి తన సొంత భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఉంగరం గుర్తు తొండకూరు గ్రామపంచాయతీ ఎన్నికలలో అల్లారి గంగాధర్ శక్కర్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుతో పోటీ చేస్తున్నారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను సక్రమంగా అమలు చేసి, తొండకూరు గ్రామాన్ని నిజామాబాదు జిల్లాలోనే ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
బడుగు బలహీన వర్గాలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రతి ఒక్కరి సలహాలు, సహాయ సహకారాలను స్వీకరించి ప్రజలతో కలిసి పాలన సాగిస్తానని పేర్కొన్నారు.
గ్రామానికి సేవ చేసే అవకాశం ఇస్తే, ఒక సైనికుడిలా గ్రామ బాధ్యతలను భుజస్కందాలపై వేసుకొని అభివృద్ధి పథంలో గ్రామాన్ని ముందంజలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గ్రామం వెనుకబడి పోకుండా నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని అన్నారు.
యువతకు మంచి కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటానని, గ్రామాన్ని భవిష్యత్తు వైపు నడిపిస్తానని తెలిపారు.
గ్రామంలో సొసైటీ గోదాం నిర్మాణానికి తన సొంత భూమిని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గ్రామాభివృద్ధి కోసం తనకు ఒక అవకాశం ఇవ్వాలని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని తొండకూరు గ్రామ ప్రజలందరికీ అల్లారి గంగాధర్ శక్కర్ రెడ్డి పాదాభివందనాలతో వినమ్రంగా కోరుతున్నారు.







