ఎ9 న్యూస్,మాసాయిపేట, డిసెంబర్ 15:
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని మాసాయిపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కృష్ణారెడ్డిని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అధికారికంగా బలపరిచారు.
ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మాసాయిపేట గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్యా-వైద్య సౌకర్యాల మెరుగుదలే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
గ్రామ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని, సర్పంచ్‌గా గెలిపించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.








