
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరపాలి…
*సిబ్బందికి సూచనలు చేసిన ఎస్పి నరసింహ…
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ప్రకారం నిబంధనలు పాటిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికలు నిర్వహణలో పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర చాలా కీలకమైందని ఎస్పీ నర్సింహ అన్నారు. శనివారం పెన్ పహాడు మండల కేంద్రంలోని రైతు వేదికలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ.సిబ్బంది అంత ఒకే జట్టుగా పని చేయాలి ఇతర శాఖలతో, ఎన్నికల నిర్వహణ అధికారులతో సమన్వయంతో ఉండాలి అని సిబ్బందికి సూచించారు. స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి పోలింగ్ కేంద్రాల సిబ్బందికి సహాయ సహకారాలు అందించాలని అని కోరారు, సంఘటనలపై వేగంగా స్పందించాలని సూచించారు. పారదర్శకంగా ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి అని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం అత్యంత ముఖ్యమని, అందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలి అని కోరారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమగ్ర సమన్వయం అవసరమని ఆయన పేర్కొన్నారు. విధులు పూర్తయ్యే వరకు కేటాయించిన విధులు, ప్రాంతాలు వదలవద్దు అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమపద్దతిలో ఉంచాలి, అనుమతిలేని వ్యక్తులను, ఓటరు కానీ వారిని పరిసరాల్లోకి రానివ్వోద్దు, 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు పటిష్టంగా అమలు చేయాలి అన్నారు. ఓటర్లు సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తులు వెంట తెస్తున్నారా అనేదానిపై నిఘా ఉంచాలి అన్నారు. లెక్కింపు ప్రక్రియ సమయంలో అప్రమత్తంగా ఉండి వార్డు ల వారీగా అభ్యర్థులను లెక్కింపు కేంద్రం నుండి కొద్ది దూరం కుర్చోబెట్టాలి, లెక్కింపు జరిగే వార్డుల అభ్యర్థులను సర్పంచ్ అభ్యర్థులను, అనుమతి కలిగిన ఏజెంట్లను మాత్రమే అనుమతించాలి, ఎన్నికల అధికారి సూచనలు పాటించాలి.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ లు రాజశేఖర్, రామారావు, స్థానిక ఎస్ఐ, విధులు నిర్వహణకు వచ్చిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







