ఉంగరం గుర్తుతో ఈర్పు మహేష్ బరిలోకి…
నందిపేట్ మండలం సిద్ధాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో ఉంగరం గుర్తుతో పోటీ చేస్తున్న ఈర్పు మహేష్
“సమ సమాజ స్థాపనయే నా సంకల్పం – ప్రేమే లక్ష్యం – సేవే మార్గం – జై శ్రీరామ్” అనే నినాదంతో గ్రామ ప్రజలను తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
బడుగు, బలహీన వర్గాలు సహా అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు, పెన్షన్లు, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోనే సిద్ధాపూర్ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఒకప్పుడు దేశంలోనే మొట్టమొదటి ఇంటర్నెట్ గ్రామంగా గుర్తింపు పొందిన సిద్ధాపూర్ను, మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. చిన్న–పెద్ద తేడా లేకుండా అందరి సహాయ సహకారాలతో, సామరస్యపూర్వకంగా గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని తెలిపారు.
🗳️ ఉంగరం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి ఈర్పు మహేష్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని సిద్ధాపూర్ గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను







