గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఆవుల రాజిరెడ్డి….

On: Saturday, December 13, 2025 3:41 AM

 

ఎ9 న్యూస్ ,నర్సాపూర్ ,మెదక్ ,డిసెంబర్ 12:

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని గ్రామపంచాయతీ ఎన్నికల భాగంగా కౌడిపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం వేగంగా కొనసా గుతోంది ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ తండా, లింగంపల్లి, కొట్టాల, వెల్మకన్నె, దేవులపల్లి, కూకుట్లపల్లి, ధర్మసాగర్, బూరుగడ్డ, రాజీపేట గ్రామాల్లో పర్యటించి ప్రజలను ముఖా ముఖిగా కలిసి ప్రచారం నిర్వ హించారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్థులను కోరుతూ, గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయగల నైపుణ్యం కాంగ్రెస్ అభ్యర్థులదేనని స్పష్టం చేశారు. ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను విశ్వసించి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రచార కార్యక్రమంలో ప్రజలు, మహిళలు, యువత విస్తృతంగా పాల్గొని పార్టీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం విశేషంగా నిలిచింది.

05 Feb 2026

Leave a Comment