మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు పై కత్తులతో దాడి….

On: Friday, December 12, 2025 3:18 PM

 

రాజన్న జిల్లా: డిసెంబర్12

వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రూరల్ మండలం నాగయ్య పల్లెకు చెందిన రొండి రాజు పై దుండగులు కత్తులతో దాడి కి పాల్పడ్డారు శుక్రవారం తెల్లవారుజామున గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరు దుండగులు రాజు పై దాడికి ప్రయత్నించగా దాడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో తల భాగంలో కత్తిపోటుకు గురయ్యాడు.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ వేములవాడలోఈ దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. తీవ్ర గాయాలైన రాజును స్థానికులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాస్పిటల్‌కు వెళ్లి రాజును పరామర్శించారు.

తనపై దాడికి పాల్పడింది నాగాయపల్లి గ్రామానికి చెందిన శివతో పాటు మరో వ్యక్తి అని రాజు తెలిపాడు. జరిగిన సంఘటనపై వేములవాడ రూరల్ మండల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

08 Mar 2026

Leave a Comment