గాయాలతో , తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న వ్యక్తిని గమనించిన పోలీసులు…..

On: Friday, December 12, 2025 6:02 AM

పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలించిన రక్షక బటులు…

ఎ9 న్యూస్ మెదక్ డిసెంబర్ 11

స్థానిక సంస్థల ఎన్నికల బందోబస్తు విధులు పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న ఆర్ఐ శైలేందర్‌ , సిబ్బంది శ్రావణ్,సురేష్, సంతోష్, శ్రీకాంత్‌లతో కూడిన పోలీసు బృందం మార్గ మధ్యంలో రోడ్డుపై తీవ్ర రక్తస్రావంతో పడిఉన్న వ్యక్తిని గమనించారు. వెంటనే స్పందించిన పోలీస్ అతన్ని పోలీసు వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తక్షణ చికిత్స అందేలా చేసి ప్రాణాపాయం నుండి రక్షించారు. తరువాత అతన్ని గాంధీనగర్‌కు చెందిన కిరణ్‌గా గుర్తించారు. రోడ్డుపై గాయాలపాలై పడి ఉన్న వ్యక్తిని ఎవరూ సహాయం చేయకుండా నిర్లక్ష్యంగా చూస్తున్న పరిస్థితుల్లో, పోలీసు సిబ్బంది చూపిన స్పందనతో అక్కడ ఉన్న ప్రజల ప్రశంసలను అందుకున్నారు.

05 Feb 2026

Leave a Comment