మానవత్వం కు చాటి చెప్పిన పోలీస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి దేశానికి నిదర్శనం…
మానవత్వం నా మనసులో నా హృదయంలో ఉన్నదని చాటిచెప్పిన పోలీస్ పోచయ్య…
ఎ9 న్యూస్ ,మెదక్ ,డిసెంబర్ 11:
మెదక్ జిల్లాలో గురువారం జరిగిన తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించేందుకు వచ్చిన వృద్ధ మహిళను పోలింగ్ బూత్ వరకు చేతులతో సహాయం అందించిన రేగోడు ఎస్సై పోచయ్య ప్రజల ప్రశంసలు అందుకున్నారు. నడవడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలిని సురక్షితంగా బూత్ వరకు చేర్చి ఓటు వేయడానికి అవసరమైన సహాయం అందించారు. ఎన్నికల సమయంలో వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పోలీసులు చూపిన ఈ సేవాభావం స్థానికంగా మంచి అభినందనలు పొందుతోంది.








