మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ గారి 69వ వర్ధంతిను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో ప్రసంగించిన ప్రముఖులు మాట్లాడుతూ, రాజ్యాంగం సూచించిన విలువలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ పరస్పరం హక్కులను గౌరవించి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించిందని గుర్తుచేశారు.








