మాసాయిపేటలో రాజకీయ వేడి… బీఆర్ఎస్ శక్తి ప్రదర్శన.

On: Thursday, December 4, 2025 5:40 PM

సొంత రాజిరెడ్డి గ్రామంలో సీనియర్ బీసీ ముద్దుబిడ్డ చిట్టిమీల నాగరాజ్ గెలుపు తథ్యం….

మాసాయిపేట ,మెదక్, డిసెంబర్ 4 :

మాజీ సర్పంచ్ చిట్టిమీల నాగరాజు మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడానికి సునీత లక్ష్మారెడ్డిని ముందుకు తీసుకొచ్చి, బలమైన ప్రదర్శన చేపట్టారు.

బీసీ ముద్దుబిడ్డగా పేరొందిన చిట్టిమీల నాగరాజుకు స్థానిక నాయకులు, ఉద్యమ కార్యకర్తలు, దాదాపు 200 మంది బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీగా సహకరించారు. టపాసులు, డ్యాన్సులతో ఆకట్టుకున్న ఈ ర్యాలీతో నామినేషన్ కేంద్రం సందడిగా మారింది.

మాజీ మధుసూదన్ రెడ్డి కూడా ర్యాలీకి హాజరై, అభ్యర్థిని బలపరిచారు. మాసాయిపేటలో బీఆర్ఎస్ శక్తి ప్రదర్శన చేయడంతో స్థానిక రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది.

12 Mar 2026

Leave a Comment