సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నేడు టిపిసిసి కీలక భేటీ….

On: Tuesday, December 2, 2025 10:59 AM

 

హైదరాబాద్:డిసెంబర్ 02

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత సమావేశం ఈరోజు గాంధీభవన్‌లో జరగనుంది. పార్టీ చీఫ్ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది.

ఈ కీలక భేటీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, మంత్రులు, కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు. ఈ సమావేశం లో కొత్తగా ఎన్నికైన జిల్లా, పట్టణ కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షులతో పాటు, ఇదివరకు ఆ పదవుల్లో కొనసాగిన నాయకులు కూడా పాల్గొననున్నారు.

ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి,సమక్షంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా, పట్టణ అధ్యక్షులకు మహేశ్‌గౌడ్‌ నియామక పత్రాలను అందజేస్తారు. అలాగే పదవీ కాలం పూర్తి చేసుకున్న అధ్యక్షులను పార్టీ సన్మానిం చనుంది. ఆ తర్వాత త్వర లో జరగబోయే పంచాయ తీలు సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరిం చాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

దీంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జరుపుకోవాల్సిన ‘ప్రజా పాలనా విజయోత్సవాల’ నిర్వహణపై కూడా నేతలు దృష్టి సారించనున్నారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మీనాక్షి నటరాజన్‌, మహేశ్‌గౌడ్‌లు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

11 Mar 2026

Leave a Comment