A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్ రూరల్:
ఆర్మూర్ మండలంలోని సోమవారం రాత్రి 7:30 గంటలకు పోలీసులు సుర్బిర్యల్ గ్రామంలో పల్లికొండ సాయన్న నిర్వహిస్తున్న అనధికారిక బెల్ట్ షాప్పై దాడి చేసి, అతని వద్ద నుండి ఇండియన్ మేడ్ లిక్కర్ (IML) వివిధ రకాలుగా మొత్తం 7 లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు అనధికార మద్యం విక్రయంపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. గ్రామంలో అనధికార మద్యం విక్రయాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతాయని సీఐ సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు.







