జగిత్యాల జిల్లా, మల్యాల మండలం, కొండగట్టు:
కొండగట్టులో శనివారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించి వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా చెలరేగిన మంటలు నిమిషాల్లోనే చుట్టుపక్కల షాపులకు వ్యాపించడంతో మొత్తం 30 దుకాణాలు మంటల్లో చిక్కుకున్నాయి.
ఈ ప్రమాదంలో 20కి పైగా బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. ఆస్తి నష్టం అంచనాలు వేస్తుండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు.






