తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ గోల్డ్ కప్ కు ఎంపికలు…..

On: Saturday, November 29, 2025 7:22 PM

 

A9 news ఆర్మూర్:

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో గల క్రికెట్ క్రీడాకారులకు శుభవార్త తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న తెలంగాణ గోల్డ్ కప్ 2025 t20 క్రికెట్ టోర్నమెంట్ కోసం ఆర్మూర్ డివిజన్ పరిధిలోని క్రికెట్ క్రీడాకారులకు ఎంపికలు జరుగుతున్నట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి, సభ్యులు రతన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రికెట్ క్రీడాకారుల నిజమైన ప్రతిభను వెలికి తీసేందుకై ఈ ప్రాంత పరిధిలో ఉన్నటువంటి క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చిందికై ఈ గోల్డ్ కప్ లు నిర్వహిస్తున్నట్లు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతిభ ఉన్న ప్రతి క్రీడాకారుడు ఈ ఎంపికలో పాల్గొనాలని వారు తెలిపారు. ఎంపికలు పూర్తిగా మెరిట్ ఆధారంగా పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. సత్తా ఉన్న క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొనాలని తెలిపారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లా తరఫున జట్లను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ ఎంపికలు ఆర్మూర్ మోడల్ స్కూల్లో తేదీ నవంబర్ 30, ఆదివారం రోజు ఉదయం 9.30 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సెలక్షన్స్ ఓపెన్ టు ఆల్ అన్ని ఏజ్ గ్రూపుల 25సంవత్సరాల లోపు క్రీడాకారులకు నిర్వహిస్తున్నట్లు ఈ సెలక్షన్లో పాల్గొనే క్రీడాకారులు ఆధార్ కార్డు, వైట్ డ్రెస్, సొంత క్రికెట్ కిట్లతో రావాలని తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే కింద తెలిపిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోగలరు. 8317595377.

15 Mar 2026

Leave a Comment