A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం రోజు జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆర్మూర్ మండల అధ్యక్షుడు పింజ సుదర్శన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబేద్కర్ యువజన సంఘం ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి కొంత మురళీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతులను 1949 నవంబర్ 26వ తేదీ రోజు రాజ్యాంగ ప్రతులపై సంతకాలను చేసి సమర్పించిన రోజు కావున అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేటి రోజును జాతీయ న్యాయ దినోత్సవం గా ప్రకటిస్తున్నామని తెలిపారు. ఆనాటి నుండి నేటి వరకు నవంబర్ 26వ తేదీని జాతీయ న్యాయ దినోత్సవం గా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇది భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత దేశానికి అందించిన దిక్సూచికి ఇచ్చిన గౌరవంగా ఆనాడు నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మాల సంఘం పోచమ్మ గల్లి అధ్యక్ష కార్యదర్శులు వెన్న రమేష్, పులి యుగేందర్, తదితరులు పాల్గొన్నారు.







