మద్యం తాగి ,ద్విచక్ర వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు మంగళవారం నాడు ఆర్మూర్ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి గట్టు గంగాధర్ రెండు రోజుల జైలు శిక్ష విధించారని జక్రాన్ పల్లి ఎస్ ఐ మహేష్ తెలిపారు.
నూతన మోటార్ వెహికల్ చట్టం ప్రకారం మొదటి సారి డ్రంక్ అండ్ డ్రైవ్ లొ పట్టుబడితే 10,000వేల రూపాయలు జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష , రెండో సారి పట్టుబడితే 15,000వేల రూపాయల జరిమాన మరియు 6 నెలల జైలు శిక్ష ఉంటుందని జక్రాన్ పల్లి ఎస్ ఐ మహేష్ తెలిపారు.






