సానీక్ష ఫౌండేషన్ మరియు SS ఫౌండేషన్ సౌజన్యంతో రామాయంపేట పరిధిలోని కోమటిపల్లి తండాలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు మరియు షూస్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో SS ఫౌండేషన్ అధ్యక్షులు నాని గౌడ్, సహా వ్యవస్థాపకురాలు మౌనిక, సానీక్ష ఫౌండేషన్ అధ్యక్షులు డి. శివ, పద్మశాలి సంఘం సభ్యులు సుధాకర్, శ్రీను, నరేందర్, స్వామి, స్కూల్ ఉపాధ్యాయురాలు, మంగ్య నాయక్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
దాతల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఫౌండేషన్ సభ్యులు భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.







