మైనారిటీ మహిళల సంక్షేమానికి ప్రభుత్వం మరో 2 పథకాలు ప్రవేశపెట్టింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ద్వారా వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలకు రూ.50వేల ఆర్థిక సాయం అందించనుంది. రేవంతన్న కా సహారా పథకం కింద దూదేకుల ముస్లింలకు మోపెడ్లు, బైక్లు పంపిణీ చేయనుంది. ఆసక్తిగలవారు OCT 6 వరకు OBMMS పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి భారతి తెలిపారు.







