A9 న్యూస్ ప్రతినిధి చిన్న శంకరంపేట్:
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయిప్రసాద్ గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, శరీరాన్ని కదల్చలేని స్థితికి చేరారు. అప్పటి నుంచి ఆయనను శాశ్వతంగా మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆయనకు అవసరమైన వాటర్ బెడ్ కోసం అనేక మార్లు ప్రయత్నాలు చేసినా, సాధించలేకపోయారు.
ఈ విషయం సానిక్షా ఫౌండేషన్ అధ్యక్షుడు శివ కి తెలిసిన వెంటనే, ఆయన చొరవ తీసుకుని హైదరాబాదులోని సారా సెవెన్ రేస్ ఫౌండేషన్ దాత వసంత రాయల్ గారిని సంప్రదించారు. వారి సహాయంతో, నేడు (తేదీ: 16 సెప్టెంబర్ 2025) వడ్ల సాయిప్రసాద్ కి వాటర్ బెడ్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గ్రామస్థులు, బంధువులు మరియు ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. వడ్ల సాయిప్రసాద్ కుటుంబం ఈ సహాయానికి హర్షం వ్యక్తం చేస్తూ, వసంత రాయల్, శివ లకు కృతజ్ఞతలు తెలిపారు.







