నందిపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద MRPS ఆందోళన….

On: Monday, September 15, 2025 8:11 PM

 

నందిపేట్, సెప్టెంబర్ 15:

గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు VHPS–MRPS ఆధ్వర్యంలో నందిపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. వికలాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీతా కార్మికులకు రూ.4,000 పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.

ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, దాదాపు 22 నెలలు గడిచినా పెన్షన్లు పెంచలేదని విమర్శించారు. పెరిగిన ధరల దృష్ట్యా ప్రస్తుత పెన్షన్లు జీవనాధారానికి ఏమాత్రం సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నందిపేట్ మండల కన్వీనర్ పైడాకుల ప్రశాంత్ మాదిగ, సీనియర్ నాయకులు కలిగిట్ సంతోష్ మాదిగ, వికలాంగుల మండల కమిటీ అధ్యక్షులు లక్ష్మి, ఇంచార్జ్ ఖలీం, డొంకేశ్వర్ మండల అధ్యక్షులు భూమేష్, ఉపాధ్యక్షులు నర్సన్న, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

15 Mar 2026

Leave a Comment