యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి – ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ…..

On: Wednesday, September 10, 2025 7:47 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్‌:

ఆర్మూర్ మండల కేంద్రంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అధిక వేగంతో వాహనాలు నడపడం, మద్యం సేవించడం, డ్రగ్స్ వాడకం వంటివి ప్రమాదాలకు దారి తీస్తాయని, కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

కళాశాల డైరెక్టర్ నవీన్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో జీవిస్తూ, ట్రాఫిక్ పోలీసులకు గౌరవం ఇవ్వాలని కోరారు. చదువులో లక్ష్యం పెట్టుకొని కృషి చేస్తేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

07 Mar 2026

Leave a Comment