ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ నుంచి కామారెడ్డి వరద బాధితులకు సహాయం

On: Friday, September 5, 2025 2:18 PM

 

A9 న్యూస్, మెదక్ – సెప్టెంబర్ 5

కామారెడ్డి జిల్లాలో ఇటీవల సంభవించిన భారీ వర్షాల వల్ల గణనీయమైన నష్టం జరిగింది. ఈ సందర్భంలో బాధితుల సహాయార్థంగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. రూ.15 లక్షల విలువైన 495 నిత్యావసర కిట్లను పంపిణీ చేసేందుకు ఫౌండేషన్ సిద్ధమైంది.

ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రతినిధులు వంశీ, వినోద్‌లను రాష్ట్ర ఇన్చార్జ్ మంత్రి సీతక్క ప్రజా భవన్‌లో ప్రత్యేకంగా సత్కరించారు. ఆపదలో అండగా నిలిచిన ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

అంతేకాకుండా, ములుగు జిల్లాలో కూడా ఫౌండేషన్ పెద్ద ఎత్తున సహాయం అందించేందుకు సిద్ధమైంది. అక్కడ రూ.20 లక్షల విలువైన 634 నిత్యావసర కిట్లను త్వరలో పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

15 Mar 2026

Leave a Comment