ఎ9 న్యూస్, మెదక్ ,సెప్టెంబర్ 5:
టీచర్స్ డే పేరుతో మనువాద భావజాలం లేదా పెట్టుబడిదారి భావజాలం అభివృద్ధి చేసే రోజుగానే కొనసాగుతున్నది.ఫ్యూడల్ పితృస్వామ్య అధిపత్యము లేని కులము మతము ప్రాంతము జాతి అడ్డుగోడలు అసమానతలు వివక్షతలేని మనిషిని మనిషిగా గుర్తించే ఉన్నత సమాజం కోసం భావి భారత పౌరులను తీర్చిదిద్దడమే గురువుల ధ్యేయంగా ఉండాలి. ఈ కర్తవ్యాన్ని భారతదేశంలో మొట్టమొదటగా ఆదర్శంగా కొనసాగించిన టీచర్ సావిత్రిబాయి పూలే.
సోషలిస్టుల దృష్టిలో టీచర్స్ డే అంటే మనువాదానికి వ్యతిరేకంగా బూర్జువా భావజాలానికి వ్యతిరేకంగా శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా సామాజిక అణిచివేతలకు వివక్షతలకు వ్యతిరేకంగా , అసమానతలకు వ్యతిరేకంగా శ్రామిక వర్గ భావజాలాన్ని సోషలిస్టు భావజాలాన్ని అభివృద్ధిపరిచే ఆదర్శనీయమైన గురువుల స్ఫూర్తిని కొనసాగించాలి.







