స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి: చెరుకు శ్రీనివాస్ రెడ్డి…

On: Thursday, September 4, 2025 7:29 PM

 

ఎ9 న్యూస్, దుబ్బాక | సెప్టెంబర్ 4:

తొగుట మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలన్నదే తమ లక్ష్యమని స్పష్టంచేశారు.

“కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో గౌరవం ఉంటుంది. రానున్న సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి,” అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంచాలని కార్యకర్తలను ఉద్దేశించి చెప్పారు.

ఎలాంటి సమస్య వచ్చినా కార్యకర్తలు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), తొగుట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కం స్వామి, ఉపాధ్యక్షులు అనిల్, మాజీ సర్పంచ్ చిలివేరి రాంరెడ్డి, తోయేటి ఎల్లం, ఉప్పలయ్య, కుంభం బాల్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, కృష్ణ, కుంభాల శీను తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

12 Mar 2026

Leave a Comment