ఆర్మూర్, సెప్టెంబర్ 4:
ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని 20వ వార్డు, నంది కాలనీలో గల నందీశ్వర గణేష్ మండలి వద్ద బుధవారం రాత్రి కాలనీ మహిళలు ఘనంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గణేశ్ విగ్రహ దాతగా ఉన్న 20వ వార్డు కౌన్సిలర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నుభాయ్కు మహిళలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా పాల్గొన్న వాతావరణం హర్షాతిరేకంగా సాగింది.
పాల్గొన్న మహిళలు:
పింజ అనుత్య, స్వప్న, లక్ష్మీ, అర్చన, వరలక్ష్మి, మీనాక్షి, సమీక్ష, శ్రీధాత్రి తదితరులు.
మండలి సభ్యులు:
పింజ సుదర్శన్, తోపారం శ్రవణ్ కుమార్, బత్తుల సంతోష్, కోటగిరి స్వామి కుమార్, అలుక రాము, గౌడ్ సంతోష్, గోపి, పింజ రుద్రాన్ష్, బత్తుల కౌశిక్, దేవాన్ష్, అన్విక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమం ముగింపులో గణేశ్ మండలి సభ్యులు, కాలనీ వాసులు మహిళల కృషిని కొనియాడారు.







