ఎ9 న్యూస్, మాసాయిపేట, సెప్టెంబర్ 3:
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మాతృదేవోభవ కానుక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మాతృదేవోభవ కానుక ఆవుల రాజిరెడ్డి సొంత నిధులతో గర్భిణీ మహిళలకు ప్రోటీన్ మరియు ఐరన్ టానిక ఉచిత, కిట్టు ఉచితం పంపిణీ చేయడం జరిగిందని, మాసాయిపేట కాంగ్రెస్ పార్టీ పిఎ సిఎ స్ ఊదండపురం నరసింహులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీకాంత్, నాగిరెడ్డి జిల్లా నాయకుడు, నరేందర్ రెడ్డి, వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి ,మాజీ ఎంపీటీసీ సిద్ధిరాములు గౌడ్ ,మాజీ ఫకీర్ మాసాయిపేట మాజీ ఉప సర్పంచ్ ,ఊదండపురం నాగరాజు, గ్రామ అధ్యక్షుడు గుండారం శ్రీను ఎల్లప్ప శంకర్ వెంకటి పాల్గొన్నారు.







