ఇసుక మాఫియాపై పోలీసుల గట్టి దెబ్బ…..

On: Tuesday, September 2, 2025 5:49 AM

 

ఏడు లారీలు స్వాధీనం – ఏడుగురుపై కేసులు నమోదు.

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

భీమ్‌గల్ మండలం బెజ్జోరా వాగు నుండి ఆర్మూరుకు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పోలీసులు గట్టి దాడి చేశారు. గోవిందపేట్, పెర్కిట్ గ్రామాల వద్ద వాహనాలను ఆపి తనిఖీ చేసిన పోలీసుల బృందం, అక్రమ ఇసుక లారీలను స్వాధీనం చేసుకుంది.

ఈ క్రమంలో మెట్పల్లి చెందిన ధారంగుల సాయిబు రావ్, బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పల్లెపు రాజన్న, దేరంగుల వీరన్న, మామిడి మహిపాల్, మోర్తాడ్ గ్రామానికి చెందిన దేవల్ల ఎల్లయ్య, రామచంద్రపల్లి గ్రామానికి చెందిన ముద్దంగుల రమేష్, మునిపల్లి గ్రామానికి చెందిన దండుగుల దుర్గయ్య లకు చెందిన లారీలను పట్టుకున్నారు.

పోలీసులు పంచనామా చేసి వాహనాలను స్టేషన్‌కు తరలించగా, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

15 Mar 2026

Leave a Comment