బజరంగ్ దళ్ యూత్ ఆధ్వర్యంలో పుప్పాలపల్లిలో మహా అన్నదాన కార్యక్రమం..,

On: Monday, September 1, 2025 8:09 PM

 

జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో బజరంగ్ దళ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా గ్రామంలో వినాయకుని ప్రతిష్టాపన నిర్వహిస్తూ, ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.

అన్నదాన కార్యక్రమంలో యూత్ సభ్యులు వినోద్, రంజిత్, వంశీ, భూమేష్, నవీన్, మహేష్, సంతోష్, రాజు, ప్రవీణ్, మధు, మరియు పొచమ్మ గల్లీ మహిళలు సహా గ్రామస్థులు భారీగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సవ మూడో రోజు సందడి నెలకొంది.

15 Mar 2026

Leave a Comment