చైతన్యపురి కాలనీ నుండి భారీ ఎత్తున బీజేపీలో చేరిక…

On: Saturday, August 30, 2025 5:19 PM

 

నర్సాపూర్‌లో బీజేపీకి జనం జల్లు.

చైతన్యపురి కాలనీ ప్రజల బీజేపీ చేరిక.

మెదక్ జిల్లా – నర్సాపూర్

ఆగస్ట్ 30, 2025;

నర్సాపూర్ పట్టణం చైతన్యపురి కాలనీకి చెందిన రాణి, రాజు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ప్రజలు శనివారం రోజున బీజేపీ పార్టీ లో చేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలు, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వం, అలాగే మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వీరిని ఆకట్టుకున్నాయి.

కొత్తగా చేరినవారిని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ గారు చేతుల మీదగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘసాని సురేష్, ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, నాగరాజు, జిల్లా కార్యదర్శి బాలరాజు, ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, ఓబిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గుండం శంకర్, నర్సాపూర్ పట్టణ అధ్యక్షుడు చంద్రయ్య, మండల అధ్యక్షుడు నీలి నాగేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి సంఘసాని రాజు, ఉపాధ్యక్షుడు మహేందర్ గౌడ్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు బబ్బురి కృష్ణ పాల్గొన్నారు.

అలాగే బీజేవైఎం నాయకులు అర్వింద్ వాల్దాస్, మండల అధ్యక్షుడు రాజేష్, పట్టణ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, నాయకులు ఈశ్వర్, శ్యామ్ గౌడ్, అనిల్, బండి వేణు తదితరులు హాజరయ్యారు

నర్సాపూర్‌లో బీజేపీకి జనం జల్లు.

చైతన్యపురి కాలనీ ప్రజల బీజేపీ చేరిక.

మోదీ పథకాల ప్రభావం బీజేపీలో భారీగా చేరికలు.

4. రఘునందన్ అభివృద్ధి పనులు ఆకట్టుకున్న ప్రజలు.

15 Mar 2026

Leave a Comment