అధికారులను అప్రమత్తం చేసిన ఆర్మూర్ సబ్ కలెక్టర్….

On: Thursday, August 28, 2025 1:12 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

మూడురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా సూచించారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అలాగే, సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కింది నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.

నాయబ్ తహసీల్దార్ పి. విక్రమ్ – 9848255595.

జూనియర్ అసిస్టెంట్ నవీన్ కుమార్ – 8688006848.

సమయానుకూలంగా సమాచారం అందించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

11 Mar 2026

Leave a Comment