వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన….

On: Thursday, August 28, 2025 12:40 PM

 

హైదరాబాద్ :ఆగస్టు 28

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు పురాతన ఇళ్లలో ఉంటున్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

తెలంగాణ జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది, ఇళ్లలోకి వరద నీరు చేరింది పంటలకు తీవ్ర నష్టం కలిగింది, మరోవైపు భారీ వర్షాలు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం వరద ప్రభావిత ప్రాంతాలను గురువారం పరిశీలించనున్నారు ఉదయం 11 గంటలకు ఏరియల్ సర్వే ద్వారా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, జిల్లాలను సీఎం రేవంత్ రెడ్డి, పరిశీలించను న్నారు.

కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వానలు పడతాయని, ఈ నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

మరోవైపు, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి సహా పది జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరిక లను జారీ చేసింది. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అప్రమ త్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం ఉన్నతాధికారు లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగరంలో హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక, పోలీసు బృందాలు నిరం తరం అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించా రు. వినాయక చవితి ఉత్సవాల వేళ విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్‌కో సిబ్బందికి సూచించారు. నదులు, వాగులపై ఉన్న లోతట్టు వంతెనల వద్ద ప్రవాహం ఎక్కువగా ఉంటే రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని చెప్పారు.

చెరువులు, కుంటలకు గండ్లు పడే ప్రమాదం ఉన్నందున నీటిపారుదల శాఖ అధికారులు ముం దస్తు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాకా లంలో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖకు దిశానిర్దేశం చేశారు.

11 Mar 2026

Leave a Comment