వడ్డీ రాకెట్లకు అడ్డాగా మారిన కేంద్రం.
ఆర్మూర్ఆగస్ట్ 26,
ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ గేట్ ఇటీవలి కాలంలో వడ్డీ రాకెట్లకు అడ్డాగా మారి ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది వరుస దాడులు బలవంతపు వసూళ్లు బెదిరింపులు ఇక్కడి రోజువారీ పరిస్థితులుగా మారిపోయాయి.
ఒక్క రూపాయి నుండి 20 రూపాయల వరకు వడ్డీతో అప్పులు ఇస్తూ రియల్ ఎస్టేట్ బాండ్లు ఇల్లు పత్రాలు ప్లాట్ కాగితాలు వాహనాలను తాకట్టు పెట్టించుకుంటూ వసూళ్లు చేస్తున్నారు వడ్డీ కట్టకపోతే రికవరీ పేరుతో బానిసలుగా పనులు చేయించుకోవడం ఇంటికి వెళ్లి వేధించడం అవమానపరచడం జరుగుతున్నాయి.
నందిపేట్ గ్రామానికి చెందిన ఒక మహిళ తన బాబు ఆరోగ్యం కోసం ₹60,000 అప్పు తీసుకుంది వడ్డీ కట్ చేసి ఇచ్చినప్పటికీ తరువాత నెలకు ₹15,000 వడ్డీ వసూలు చేశారు 17 నెలలు ఆమె నుండి దాదాపు ₹2,55,000 వడ్డీ వసూలు చేశారు మరియు అసలు 60000 వసూలు చేశారు అప్పు పత్రాలు తిరిగి ఇవ్వకపోగా అడిగితే కొట్టడానికి కూడా ప్రయత్నించారు.
అలాగే అదే కాలనీ లో ఉంటున్న ఒక మహిళ అప్పుగా 10000 తీసుకోవడం జరిగింది ఇచ్చే ముందు వడ్డీ 3 రూపాయలు అని చెప్పి ఒక నెల తరువాత నెల వడ్డీ 10000 లకు 5000 అని నెల నెల వడ్డీ పెంచి కొత్త స్కూటీ ని తాకట్టు కింద ఉంచుకున్నారు.
రెండు సంవత్సరాల క్రితం మరో వ్యక్తి ₹10,000 అప్పు తీసుకున్నాడు వడ్డీ సమయానికి చెల్లించలేకపోవడంతో అతని ఇంటికి వెళ్లి గొడవ చేయడం ప్రారంభించారు అతను రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసి ఆంధ్ర వెళ్ళిపోయాడు ప్రస్తుతం ఆ బాధితుడు కూడా పోలీసులకు పిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నాడు.
ఈ విధంగా వ్యక్తిగత సెటిల్మెంట్లు బాండ్లు తాకట్టు పత్రాలు అన్నింటికీ ప్రత్యేక దళారీ నెట్వర్క్ ఏర్పడింది అమాయకులు ఎక్కడ పడితే అక్కడ వడ్డీ వలలో చిక్కుకుని తమ ఆస్తులు గౌరవం కోల్పోతున్నారు
ఒకప్పుడు గోల్ బంగ్లా ప్రాంతం పేరు ఎక్కువగా వినబడేదని ఇప్పుడు ఆర్మూర్‌లో రాజారాం నగర్ గేట్ అనే పేరు విపరీతంగా వినబడుతోందని స్థానికులు చెబుతున్నారు.
ఇప్పటికే పలువురు బాధితులు సాక్ష్యాధారాలతో పోలీసు అధికారులను సంప్రదించేందుకు సిద్ధమవుతున్నారు.
పరువు పోయింది కానీ మాకు ఇబ్బందులకు గురి చేసిన వారి అంతు చూస్తాం అంటున్నారు బాధితులు వీళ్లకు సహాయం గా పోలీస్ వాళ్ళు వున్నారు అనే ధీమాతో వున్నారు శబాష్ పోలీసన్న అంటున్నారు పలువురు.







