ఆర్మూర్‌లో పోస్టర్ ఆవిష్కరణ — అంబేడ్కర్ యువజన సంఘం పిలుపు.
ఆర్మూర్, ఆగస్ట్ 25:
బామ్ సేఫ్ రాష్ట్ర 12వ మహాసభలను విజయవంతం చేయాలని అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు లింగన్న పిలుపునిచ్చారు. సోమవారం ఆర్మూర్ పట్టణంలోని అంబేడ్కర్ ఆఫీస్‌లో స్థానిక నాయకులతో కలిసి మహాసభల ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా లింగన్న మాట్లాడుతూ, “ఈ నెల 31న కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగనున్న బామ్ సేఫ్ మహాసభలకు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి,” అని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మోర్తాడ్ మండల అధ్యక్షులు అంగుళి మాలజీ, ముఖేష్, కాపు భోజన్న, సోమిడి మహేందర్, ఎన్‌బిఎస్ సభ్యుడు శ్రీనివాస్, మాజీ చాకలి సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.






