JAKRANPALLY:
ఈరోజు తొర్లికొండ గ్రామం లో ఆయిల్ పామ్ సాగు పంట పైన అవగహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారిని దేవిక , మాట్లడుతూ,
తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును పలు రకాల సబ్సిడీ లతో సాగును ప్రోత్సహిస్తుందని,ఈ పంటను ఒకసారి నాటితే 4 సంవత్సరాల తర్వాత నిరంతర ఆదాయాన్ని 30సంవత్సరాల పాటు ఇస్తుందని,కోతులు ముట్టని, పందుల బెడద దొంగల బెడద లేని తక్కువ కూలీలు అవసరమయ్యే పంట ఆయిల్ పామ్ అని తెలిపారు. NMEO-OP స్కీమ్ కింద ఈ కింది సబ్సిడీలు ఉన్నాయి:
1)మొక్కలకు 90%రాయితీ కింద రైతు కేవలం ఒక ఎకరానికి 1000 చొప్పున జిల్లా ఉద్యాన & పట్టుపరిశ్రమ అధికారి నిజామాబాద్ పేరిట డీడీ చెల్లిస్తే 50 మొక్కలు ప్రీ యూనిక్ కంపెనీ వారిచే అందిస్తామని తెలిపారు.
2) ఆయిల్ పామ్ మధ్యలో అంతర పంటల సాగు(మొక్కజొన్న,జొన్న,పసుపు,కూరగాయలు,సోయా etc) చేసినందుకు గాను ఎకరానికి 4200/ చొప్పున రైతు ఖాతాలో సంవత్సరానికి ఒకసారి జమ చేస్తున్నామని
3) ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు చిన్న, సన్నకారు, ఐదెకరాల లోపు ఉన్నవారికి 90% రాయితీ,SC/ST రైతులైతే 100% రాయితీ,5 ఎకరాల మీదా సాగు చేసేవారు 80% రాయితీ కింద డ్రిప్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జక్రన్ పల్లి క్లస్టర్ AEO శ్రీకాంత్, ఆర్మూర్ AMC డైరెక్టర్ కనక రవి,
ప్రీ యూనిక్ కంపెనీ క్లస్టర్ ప్రతినిధి వినోద్, అలానే గ్రామ రైతులు సాయిరెడ్డి, గంగారెడ్డి జై గంగారం, వినోద్, తదితరులు పాల్గొన్నారు







