జక్రాన్ పల్లి, ఆగస్ట్ 22:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో కొత్తగా నిర్మించబోయే అంగన్వాడి కేంద్రానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో జీపి స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఇన్చార్జి ఎంపీడీవో శివకుమార్, పీఆర్ఈ సురేంద్ర వర్మ, ఏపీవో రవికుమార్, గ్రామ సెక్రటరీ రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు కనక రవి, శ్రీనివాస్, వినోద్, నల్ల గంగారెడ్డి, జై గంగారం, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలాగే గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నాగేందర్, స్వామి, గంగాధర్, అంగన్వాడి సిబ్బంది, ఆశ వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
అంగన్వాడి కేంద్ర నిర్మాణంతో గ్రామంలోని చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం, ఆరోగ్య సదుపాయాలు, మరియు విద్యా సేవలు అందుబాటులోకి రానున్నాయని నిర్వాహకులు తెలిపారు.






