విద్యార్థుల చిరుకానుకతో ఎంఈఓ జన్మదిన వేడుకలు ప్రత్యేకం..

On: Thursday, August 21, 2025 5:53 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆలూర్ మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో విద్యార్థులు ఘనంగా ఎంఈఓ నరేందర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పిన తమ గురువుగారు ఎంఈఓగా ఉండటం తమ అదృష్టమని విద్యార్థులు భావించారు. ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కలసి ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నరేందర్ కేక్ కట్ చేసి విద్యార్థులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. విద్యార్థులు స్వయంగా సిద్ధం చేసిన చిన్న కానుకను గురువుగారికి అందజేయగా, ఆయన హర్షం వ్యక్తం చేశారు. వేడుకల్లో ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థుల ఉత్సాహాన్ని అభినందించారు.

15 Mar 2026

Leave a Comment