A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాలల ఎఫ్‌ఎల్‌ఎం–టిఎల్‌ఎం మేళాను ఎంఈఓ నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొని తాము స్వయంగా తయారు చేసిన బోధనోపకరణాలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ నరేందర్ మాట్లాడుతూ – “తరగతి గదిలో బోధనోపకరణాలను వినియోగించడం వలన విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా టిఎల్‌ఎం ఉపయోగించాలి” అని సూచించారు.
మేళాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పది మంది ఉపాధ్యాయులను జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్టు తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు.






