ఎ9 న్యూస్ శివ్వంపేట/ తూప్రాన్ ఆగస్టు 18
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని తూప్రాన్ డీఎస్పీ తూప్రాన్ సీఐ, శివ్వంపేట ఎస్ఐ, కలిసి శివ్వంపేట పరిధిలోని కల్వర్ట్‌ను సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ కల్వర్ట్ తీవ్రంగా దెబ్బతింది. ప్రస్తుతం వర్షపు నీరు పాంబండా చెరువు నుండి పొతుల బోగుడ చెరువు వైపు తీవ్రంగా ప్రవహిస్తూ ఉండటంతో కల్వర్ట్‌కు ముప్పు ఏర్పడింది. ఈ నీటి ప్రవాహం కారణంగా గ్రామస్థులు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు పరిస్థితిని పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సూచనలు అందజేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలు నివారించాలని సూచించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించనున్నారు అని పోలీసులు తెలిపారు.







