శంకరంపేట మండలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ సూచన

On: Monday, August 18, 2025 2:31 PM

 

A9 న్యూస్, శంకరంపేట – ఆగస్టు 18:

మెదక్ జిల్లాలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శంకరంపేట మండలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు.

వర్షాల ప్రభావంతో కూలిపోవచ్చనే ప్రమాదంలో ఉన్న ఇళ్లలో ఉండకూడదని అధికారులు సూచించారు. అవసరమైన వారికి సమీపంలోని పాఠశాలలలో తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేయబడినట్టు తెలిపారు. ఇందుకోసం గ్రామపంచాయతీ కార్యదర్శులు లేదా రెవెన్యూ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.

ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకుని:

మండల ప్రజలు గోరువెచ్చని నీళ్లు త్రాగాలని సూచన.

రోడ్లపై వరద ప్రవహిస్తున్న చోటలలో ప్రయాణించరాదు.

ఇండ్లు కూలిన వారు తక్షణమే అధికారులకు సమాచారం ఇవ్వాలి.

06 May 2026

Leave a Comment