అతిభారీ వర్ష సూచన: అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచన….

On: Monday, August 18, 2025 11:50 AM

 

ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు హెచ్చరిక:

ఈ రోజు ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క స్పందిస్తూ:

“ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి, అవసరమైతే మాత్రమే బయటకు రావాలి,” అని సూచించారు.

ప్రాంతాల్లో వాగులు, వంకల ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున, వాటి దగ్గరికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు.

భారీ వర్షాల దృష్ట్యా, సహాయక చర్యల కోసం ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.

“భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించే అవకాశమున్నందున ప్రజలు స్వీయ రక్షణలో ఉండాలి,” అని మంత్రి సీతక్క పునరుద్ఘాటించారు.

02 May 2026

Leave a Comment