*భయంతో దూకి గాయపడి మృతి చెందిన విద్యార్థిని..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ కస్తూర్బా హాస్టల్లో విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎంపీసీ మొదటి చదువుతున్న కావేరి (16), నిజామాబాద్ నగరం దుబ్బ ప్రాంతానికి చెందిన విద్యార్థిని, ఆగస్టు 5వ తేదీ తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు హాస్టల్లోని బాత్రూం కి వెళ్లి తిరిగి వస్తుండగా కోతులు పడ్డాయని. భయంతో ఆమె హాస్టల్లోని మొదటి అంతస్తు గోడపై ఎక్కి కిందకి దూకగా తలకు తీవ్ర గాయమైంది.
తక్షణమే ఆమెను ఎంజె హాస్పిటల్‌కు తరలించగా డాక్టర్ల సూచన మేరకు అనంతరం నిజామాబాద్‌లోని ప్రగతి హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం అందాజ 8:40 గంటల సమయంలో ఆమె మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
హాస్టల్, కళాశాల ప్రాంగణంలో కోతుల బెడద గత కొంతకాలంగా విద్యార్థినులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. విద్యార్థినుల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






