నిజామాబాద్ జిల్లా, డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మహిళల బేస్ బాల్ జిల్లాస్థాయి సెలక్షన్ ప్రబుల్స్ నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో మూడు రోజుల శిక్షణ శిబిరం ఏర్పాటు చేయబడింది. శిక్షణ అనంతరం తుది జట్టు ఎంపిక చేయబడింది.
ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ నళినీ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ,
“ఈనెల 16 నుండి 18 వరకు అదిలాబాద్ జిల్లా ఐపీ స్టేడియంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో మన జట్టు అత్యుత్తమ ప్రతిభను కనబరచాలి. జిల్లా మరియు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం. క్రీడాకారిణులందరికీ ఆల ది బెస్ట్.”
ఈ కార్యక్రమంలో జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సొప్పరీ వినోద్, సీనియర్ వైస్ ప్రిన్సిపల్ సప్న, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ వనిత, సాఫ్ట్‌బాల్ కోచ్ మౌనిక, స్కూల్ పీ.ఈ.టి.లు జోష్ణ మరియు నర్మద, సీనియర్ క్రీడాకారిణులు పాల్గొన్నారు.







