ఆర్మూర్ శివారుల్లో చిరుత పులి కలకలం :

On: Sunday, August 10, 2025 1:12 PM

 

A9 న్యూస్, ఆర్మూర్ ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులో చిరుత పులి కనిపించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పెద్దమ్మ తల్లి గుడి సమీపంలో భక్తులు చిరుతను చూశారనే సమాచారం వెలువడడంతో, ఆందోళన నెలకొంది. వెంటనే స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను జల్లెడ పట్టారు.

 

ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, “ప్రస్తుతం వరకు చిరుత పులి పాదముద్రలు గానీ, ఇతర ఆనవాళ్లుగానీ కనుగొనలేకపోయాం. అయినా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా చిరుతను చూడగలిగితే వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని” కోరారు.

అటవీ అధికారులు స్థానికులను ఒంటరిగా ప్రయాణించకుండా, గుంపులుగా సంచరించాలని సూచిస్తున్నారు. అవసరమైనంత వరకు రాత్రి వేళల్లో అటవీ ప్రాంతాలవైపు వెళ్లకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం పూర్తి స్థాయి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాస్తవంగా చిరుత ఉందా, లేక అపోహలేనా అన్నది అధికారులు త్వరలో తేల్చే అవకాశం.

21 Jun 2026

Leave a Comment