ఆర్మూర్: కిసాన్ మోర్చా రాష్ట్ర రైతు నాయకుడు నూతల శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా, ఆర్మూర్ ప్రాంతంలోని ఇటుక బట్టీల వద్ద ఉన్న పేద పిల్లలకు మరియు పెద్దవారికి బట్టలు పంపిణీ చేసి, స్వీట్స్ తినిపిస్తూ వారితో పాలు పంచుకుంటూ సంతోషంగా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మందుల బాలు, చిట్టి భజన శేషగారి లింగం, నందు, గంగాధర్, నక్కల రాములు, రాజన్న, నవీన్ తదితరులు పాల్గొన్నారు. పేదలపై ప్రేమతో, సేవా దృక్పథంతో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరిలో సానుకూల స్పందన కలిగించిoది.







