నిజామాబాద్ A9 న్యూస్:
యూనివర్సిటీ విధానాలకు వ్యతిరేకంగా నిబంధనలను పట్టించకుండా అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ నడుపుతున్న శ్రీ రాఘవేంద్ర బి.ఎడ్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలిని – పిడిఎస్యు ప్రిన్స్ డిమాండ్
ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్ మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని గల శ్రీ రాఘవేంద్ర బి.ఎడ్ కళాశాల యూనివర్సిటీ విధానాలకు వ్యతిరేకంగా నిబంధనలను పట్టించకుండా ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ నడుపుతున్నారు.
అంతేకాకుండా యూనివర్సిటీ నిర్ణయించిన ఎగ్జామ్ ఫీజుల కంటే అధిక ఫీజులు విద్యార్థుల నుండి ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నారు అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం అని ఆయన అన్నారు. కనుక శ్రీ రాఘవేంద్ర బి.ఎడ్ కళాశాలను వెంటనే సీజ్ చేసి వాటి గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు మరియు అక్రమంగా అధిక ఫీజులు చేసిన డబ్బులను తిరిగి
విద్యార్థులకు ఇవ్వాలని వారు కోరారు లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారని, భౌతిక దాడులకు కూడా వెనకాడరని. ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నదీమ్, అక్షయ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.