మాదిగ కుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహణ…
A9 న్యూస్, మాసాయిపేట, జూలై 30:
మాసాయిపేట మండల కేంద్రంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో మాదిగ కుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ నాయకుడు గౌరగళ్ల రాములు మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు మాదిగకు శాలువాతో సన్మానం చేసి, కేక్ కట్ చేయించి స్వీట్లు పంచుకున్నారు. ఆయన గతంలో సమాజానికి అందించిన సేవలను గుర్తు చేస్తూ పలువురు నాయకులు అభినందించారు. అలాగే బీజేపీలో తన సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారని, మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా శాలువాతో సన్మానించిన విషయాన్ని ప్రస్తావించారు. దళితులు, పేదలకు మరింత సేవ చేయాలని, కుల సంఘాలతో కలిసి పనిచేస్తూ బీజేపీలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని సంఘం నాయకులు ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు, నిజామాబాద్ ఇన్చార్జి మాసాయిపేట యాదగిరి మాదిగ, టీఎస్ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు గుడి కృష్ణ మాదిగ, కాంగ్రెస్ నాయకుడు ముక్క దశరథ మాదిగ, బీసీ ఉపకులాల సంఘం నాయకుడు సోమేష్, సీనియర్ జర్నలిస్ట్, దళిత ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్, మాదిగ కుల సంఘం నాయకులు ముక్క యాదగిరి మాదిగ, బీఆర్ఎస్ దళిత నాయకుడు డప్పు మహేష్ మాదిగ, ఆశిష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.








