A9 న్యూస్ నిజామాబాద్ రూరల్:
ఇందల్వాయి మండలంలోని హర్షిని ఆధార్ సేవా కేంద్రాన్ని తహశీల్దార్ బాలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన రుసుముల మేరకే ఆధార్ సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. అధిక రుసుములు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో ఆర్ఐ ప్రవీణ్ కుమార్, జీపీఓలు ప్రమోద్, సాయన్న పాల్గొన్నారు.








