మంథని–దేగాం, పిప్రి–మగ్గిడి, చేపూర్ లో- లెవెల్ బ్రిడ్జిలను పరిశీలించిన ఎంపీడీఓ….

On: Thursday, July 30, 2026 6:52 PM

 

A9 న్యూస్ ఆర్మూర్:

భారీ వర్షాల నేపథ్యంలో ఆర్మూర్ మండలంలోని మంథని–దేగాం, పిప్రి–మగ్గిడి, చేపూర్ హైవే వద్ద ఉన్న లో-లెవెల్ బ్రిడ్జిలను ఎంపీడీఓ పరిశీలించారు. బ్రిడ్జిల వద్ద నీటి ప్రవాహం, రాకపోకల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివాజీ మాట్లాడుతూ, ప్రస్తుతం మూడు ప్రాంతాల్లోనూ నీటి ప్రవాహం బ్రిడ్జి స్థాయి కంటే దిగువన ఉండటంతో సాధారణ వాహనాల రాకపోకలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటి మట్టం పెరిగితే లో-లెవెల్ బ్రిడ్జిలను దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఎంపీడీఓ విజ్ఞప్తి చేశారు.

30 Jul 2026

Leave a Comment