A9 న్యూస్ నిర్మల్;
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో గణనీయంగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రాజెక్టు 6 గేట్లను 8 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
వరద నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదులు, వాగులు, ప్రాజెక్టు పరిసర ప్రాంతాలకు ఎవరూ వెళ్లవద్దని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని హెచ్చరించారు. ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించి అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.








