A9 న్యూస్ ఆర్మూర్;
ప్రభుత్వ సేవలో ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన డొంకేశ్వర్ తహసీల్దార్ కార్యాలయ సబార్డినేట్ (అటెండర్) రామిల్లి భూమన్నకు గురువారం ఘనంగా సన్మానం చేసి భావోద్వేగ వాతావరణంలో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా డొంకేశ్వర్ తహసీల్దార్ జి. ప్రసాద్ మాట్లాడుతూ, భూమన్న తన సేవా కాలంలో నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నవీపేట్ తహసీల్దార్ వెంకటరమణ, విశ్వకర్మ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామ్ మహిపాల్ చారి, డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు గణేష్ గౌడ్, ఆర్‌ఐ నితీష్ రెడ్డి, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొని భూమన్నను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.








